ETV Bharat / state

ఆదోని శివారులో ఆటో బోల్తా..10 మందికి గాయాలు - కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని శివారులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఆదోని శివారులో ఆటో బోల్తా
ఆదోని శివారులో ఆటో బోల్తా
author img

By

Published : Aug 26, 2021, 7:13 PM IST

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఇస్వీ వంతెన వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదోనిలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన వారు... ఉరుకుందా దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో ఆదోని వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూటర్​ను తప్పించబోయి..... ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ పది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: నిలకడగా కరోనా కేసులు... కొత్తగా 1,539 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.