కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డ్ స్థాయిలో పత్తి విక్రయాలు జరిగాయి. విక్రయాలకు రైతులు దిగుబడులతో పెద్ద సంఖ్యలో వచ్చారు. నెల రోజుల నుంచి పత్తి సీజన్ ప్రారంభం కావటంతో మార్కెట్ యార్డు దిగుబడులతో కళకళలాడుతోంది. 19, 226 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తెచ్చారు. క్వింటాలు ధర గరిష్టంగా 5459 రూపాయలు, కనిష్టంగా 3500 ధర పలుకుతోంది. ధరలు పెరగటంతో ఉపశమనం అయిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: