పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం రవ్వలకొండ గుహలో వైకాపా నేతలు మైనింగ్‌కు పాల్పడుతున్నారని … ఆ ప్రాంత వాసులు తేదేపా జాతీయ కార్యాలయం దృష్టికి తీసుకొచ్చారు. వినతులు విన్న ప్రతిపక్ష అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖ రాస్తామని స్పందించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పరమ పవిత్రమైన ప్రాంతంలో అక్రమాలకు పాల్పడుతున్నారని, వాటిని నిలువరించే ప్రయత్నం చేయాలని కోరారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సభ్యులు సహా స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జగన్ ప్రభుత్వానికి మనిషి ప్రాణం అంటే లెక్కలేదా ?: నాగబాబు