ETV Bharat / state

ఇదేం పద్ధతి.. సొంత పనులకు ఇంటింటికి రేషన్ వాహనం...!

ఇంటింటికి రేషన్ చేరవేసేందుకు ప్రభుత్వం అందించిన వాహనాలను కొందరు తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న దేవాలయానికి కొందరు భక్తులు ఇంటింటికి రేషన్​ పంపిణీ చేసే వాహనంలో తరలివచ్చారు. ఆ వాహనాన్ని చూసిన భక్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ration vehicles
ration vehicles
author img

By

Published : Aug 19, 2021, 7:03 PM IST

ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలను కొందరు తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. మరి కొందరు ఆపద సమయంలో ఎమర్జెన్సీ కింద వినియోగిస్తున్నారు. గతంలో కోసిగి మండల పరిధిలోని దుద్ది గ్రామంలో ఈ వాహనంలో గర్భిణిని ఆసుపత్రికి తరలించి శభాష్ అనిపించుకున్నారు. మంచికి ఉపయోగిస్తే బాగానే ఉంటుంది కానీ ఇలా సొంత పనులకు వినియోగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రావణ మాసం సందర్భంగా కర్నూలు జిల్లాలోని జోహలాపురం గ్రామానికి చెందిన రేషన్ ట్రక్కులో ఓ కుటుంబం ఉరుకుందలోని ఈరన్న దేవాలయానికి వెళ్లారు. దర్శన అనంతరం కోసిగిలోని రేణుక ఎల్లమ్మ గుడి వద్ద సేద తీరుతుండగా మీడియా ప్రతినిధులు వారిని ఆరాతీశారు. వివరాలు అడిగి ఫొటోలు తీస్తుండగా ఫోన్​లు లాక్కుని అడ్డుకున్నారు. రేషన్ వాహనంలో ఇలా వెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా ప్రయాణిస్తూ ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడారని తెలుస్తోంది. ఈ వాహన డ్రైవర్​పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు హల్​చల్..

ఈ వాహనం గ్రామాల మీదుగా వెళ్తుండగా కొందరు తీసిన ఫొటోలు సామాజిక మాద్యమాల్లో హల్​చల్​ చేస్తున్నాయి. సొంత పనులకు ఈ ట్రక్కును ఉపయోగించుకోవడంపై కొంతమంది వైకాపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

gandhi hospital rape: అత్యాచారం చేయలేదు.. ఆమె అంగీకారంతోనే వెళ్లా: సెక్యూరిటీ గార్డు

ఎటు చూసినా తుపాకులే... కాబుల్​లో ప్రస్తుత పరిస్థితి ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.