ETV Bharat / state

రేషన్​లో కోతలు.. లబ్ధిదారులకు ఇబ్బందులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పడిన విపత్కర పరిస్థితుల దృష్ట్యా తెల్లరేషన్‌ కార్డుదారులకు నెలకు ఒకసారి ఇచ్చే రేషన్‌ మూడుసార్లు ఇస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, కిలో కందిపప్పును ప్రతి కార్డుదారుడికి ఉచితంగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే కర్నూలు జిల్లాలో రేషన్​ పంపిణీ నత్తనడకన సాగుతోంది. ఉచిత సరుకులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

రేషన్​లో కోతలు.. లబ్ధిదారులకు ఇబ్బందులు
రేషన్​లో కోతలు.. లబ్ధిదారులకు ఇబ్బందులు
author img

By

Published : Apr 10, 2020, 1:45 PM IST

కర్నూలు జిల్లాలో రేషన్​ పంపిణీ నత్తనడకన సాగుతోంది. లాక్​డౌన్​ దృష్ట్యా తెల్లరేషన్​ కార్డు దారులకు నెలకు ఒకసారి ఇచ్చే రేషన్​ మూడుసార్లు ఇస్తున్నారు. జిల్లాలో 11.91 లక్షల కార్డుదారులు ఉండగా.. ఇప్పటివరకూ 8.41 లక్షల మందికి రేషన్​ పంపిణీ చేశారు. ప్రస్తుతం రేషన్​ పంపిణీలో కర్నూలు 11వ స్థానంలో ఉంది.

కేవలం 46.25 శాతం మందికే

కర్నూలులో 1.05 లక్షల కార్డుదారులుండగా వారం రోజుల్లో కేవలం 48,822 (46.25 శాతం) మందికి రేషన్‌ పంపిణీ చేశారు. ఆదోనిలో 78,798 కార్డుదారులకు 36,700 మందికి రేషన్‌ పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా కొన్ని చౌకదుకాణాలకు బియ్యం ఇచ్చారు కాని కందిపప్పు కొరత ఉంది. మరికొన్ని చోట్ల ఒక చౌక దుకాణానికి 100 శాతం రేషన్‌ కోటా ఇవ్వాల్సి ఉండగా 90 శాతం సరుకులు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా భయంతో రేషన్‌ పంపిణీ రెండు, మూడు రోజులుగా నిలిపివేశారు. చౌక దుకాణాల వద్ద కార్డుదారులు సామాజిక దూరం పాటించకపోవడం వల్ల అధికారులు నగరంలో ప్రజా పంపిణీని నిలిపివేశారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లో చాలా చౌక దుకాణాల్లో రేషన్‌ సరకులు లేక దుకాణాలు మూసివేస్తున్నారు.

గడిచిన 12 రోజుల్లో 10,41,305 మంది కార్డుదారులకు (87.40 శాతం) మాత్రమే పంపిణీ చేశారు. పోర్టబులిటి కింద 3,11,642 మందికి రేషన్‌ సరకులు ఇచ్చారు. జిల్లాలో అత్యధికంగా రేషన్‌ పంపిణీ చేసిన మండలాలు ఇలా.. మద్దికెర 93.97 శాతం, ఎమ్మిగనూరు 93.18, గొనెగండ్ల 92.97, సంజామల 92.86, తుగ్గలి 92.65, పత్తికొండ 92.43, గడివేముల 92.27 శాతంతో ముందంజలో ఉన్నాయి. ఇక చిట్ట చివరన ఆదోని పట్టణంలో 72.22 శాతం, కర్నూలు అర్బన్‌ 79.85, డోన్‌ 82.86, ప్యాపిలి 83.23, కోసిగి 84.65, హాలహర్వి 84.79, పాణ్యం, కోసిగి, నందవరం, చిప్పగిరి, పెద్దకడబూరు, పగిడ్యాల, మిడ్తూరు, నంద్యాల, ఆలూరు, హొళగుంద మండలాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. 1.50 లక్షల మంది కార్డుదారులకు రేషన్‌ పంపిణీ అందలేదు. రెండో దఫా రేషన్‌ పంపిణీ ఈనెల 16 నుంచి ప్రారంభం కానుంది.

గడివేములలో ఇలా..

గడివేములలోని 9వ దుకాణంలో 638 కార్డులు ఉండగా, 572 కార్డులకు సరకులు ఇచ్చారు. బిలకలగూడూరులోని 12వ దుకాణంలో 450 కార్డులు ఉండగా, 401 కార్డులకు, 13వ దుకాణంలో 500 కార్డులకు 448 కార్డులకు సరకులు ఇచ్చారు. అందని వారు దుకాణాల డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు.

పోర్టబులిటీతో చిక్కులు

నిత్యావసర సరకులు రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునేలా అధికారులు పోర్టబులిటీ వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఇతర గ్రామాల వారు ప్రస్తుతం ఉన్న చోట సరకులు తీసుకున్నారు. గ్రామంలోని కార్డుదారులకు సరిపడా సరకులు అందకపోవడం వల్ల ఇతర గ్రామాల వారికి ఎలా ఇస్తారని లబ్ధిదారులు ఘర్షణ పడుతున్నారు.

ఇదీ చూడండి

'నెలాఖరు వరకు లాక్​డౌన్ కొనసాగించే అవకాశం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.