ప్రభుత్వం వెంటనే స్పందించి అబ్దుల్ సలాం కేసును సీబీఐకి అప్పగించాలని సలాం న్యాయ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని సమితి రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహమ్మద్ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవనగర్ గేట్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు.
రోడ్డుపై వాహనాలను నిలిపి వేయించి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారంటే సలాం కుటుంబం ఎంత ఒత్తిడి అనుభవించి ఉంటుందో ఆలోచించాలని సమితి రాష్ట్ర కన్వీనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన.. వ్యక్తిపై పోలీసుల దాడి