సరదాగా ఈత కోసం తుంగభద్ర దిగువ కాల్వలోకి దిగి ముగ్గురు యువకులు గల్లంతు కాగా, వారిలో ఇద్దరు చనిపోయారు. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో జరిగిన ఈ ఘటనపై పెద్ద తుంబళం ఎస్సై చంద్ర కథనం ప్రకారం పెద్దతుంబళం గ్రామంలోని జైన మందిరంలో రాజస్థాన్‌కు చెందిన సునీల్(18), భవాని(19), వినోద్(28) మరో ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. వారు సోమవారం సాయంత్రం సమీపంలో కాల్వ వద్దకు వెళ్లారు. ఈత సరిగా రాకపోయిన నీటిలోకి దిగినట్లు సమాచారం ముందుగా సునీల్ కాల్వలో కొట్టుకుపోతుండగా భవానీ కాపాడేందుకు యత్నించాడు. అతనూ కొట్టుకుపోతున్నట్లు గుర్తించిన వినోద్..నీళ్లలోకి దిగి రక్షించే క్రమంలో తానూ గల్లంతయ్యాడు. వీరితో పాటు వెళ్లిన మరో ఇద్దరు యువకులు ఆలయానికి వచ్చి తోటి సిబ్బందికి విషయం చెప్పారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని యువకుల ఆచూకీ కోసం గాలించారు. రాత్రి 9 గంటల తర్వాత భవానీ, సునీల్ మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. వినోద్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇదీచదవండి.