ETV Bharat / state

అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీకీ ప్రత్యేక హోదా: రాహుల్​ గాంధీ - భారత్​ జోడో యాత్ర రెండో రోజు

RAHUL BHARAT JODO YATRA : రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నింటినీ.. అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

RAHUL ON AP SPECIAL STATUS
RAHUL ON AP SPECIAL STATUS
author img

By

Published : Oct 19, 2022, 3:07 PM IST

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది

RAHUL ON AP SPECIAL STATUS: అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు నిన్న కలిశారన్న రాహుల్​.. రైతుల పాదయాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు. కర్నూలు జిల్లాలో రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతోంది.

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని.. ఖర్గే, శశిథరూర్‌ ఇద్దరూ అనుభవం ఉన్న సీనియర్‌ నేతలే అని రాహుల్​ తెలిపారు. ఎవరు ఎన్నికైనా పార్టీని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నామన్నారు. పొత్తుల అంశంపై నిర్ణయాధికారం కాంగ్రెస్‌ అధ్యక్షుడిదేనని స్పష్టం చేశారు. దేశాన్ని ఏకం చేయడమే భారత్ జోడో యాత్ర ముఖ్య లక్ష్యమని తెలిపారు. యాత్ర ద్వారా జనంతో మమేకమవుతున్నామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.