కర్నూలు జిల్లా నంద్యాల సలింనగర్లో కొండచిలువ కలకలం రేపింది. దానిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సలింనగర్లోని గడ్డి భూముల్లో దాగివున్న కొండచిలువను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. రిస్క్ టీమ్, మొబైల్ పార్టీ బృందం కలిసి దానిని పట్టుకొని గొనె సంచిలో బంధించారు. పట్టుకున్న కొండచిలువను దూరంగా ఉండే అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా వదిలేస్తామని అధికారులు తెలిపారు. కొండ చిలువ దొరకడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: