కర్నూలు నగరంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని.. తెదేపా నేతలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
ఈనెల 20 నుంచి పుష్కరాలు..
కార్యకర్తలతో కలిసి సంకల్ బాగ్, నాగ సాయిబాబా ఆలయం, సాయిబాబా ఆలయం వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ నెల 20 నుంచి పుష్కరాలు జరగనున్నాయని.. ఇప్పటి వరకు కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. అవినీతికి పాల్పడే ఉద్దేశంతోనే పనులు సాగిస్తున్నట్లు కనిపిస్తోందని నేతలు అనుమానం వ్యక్తం చేశారు.