కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామం వద్ద ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం... మృతుల కుటుంబానికి రూ.ఐదు లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది.
ఈ మేరకు శనివారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రామ్ సుందర్‌రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు ఎర్రగుంట్లలో మృతుల కుటుంబాలకు పరిహారం అందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీచదవండి.