శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. అందులో భాగంగా స్థానిక శ్రీకృష్ణ దేవరాయల కూడలిలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరారు. ప్రధాన రహదారిపై కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల నగరంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. హైకోర్టు కోసం న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 47వ రోజుకు చేరుకున్నాయి.
ఇదీ చూడండి: 'విధులకు హాజరవుతాం... తరలిస్తే ఊరుకోం'