కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జీ ప్లస్ త్రీ ఇళ్లల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో సరైన వసతులు లేవని అక్కడ ఉంటున్నవాళ్లు ఆందోళన చేపట్టారు. మూడు రోజులైనా తమను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 338 మంది ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు.
రెండు రోజులుగా వర్షం కురుస్తోదంని.. చాలా ఇబ్బందిగా ఉందని వారంతా ఆవేదన చెందారు. ఇళ్లకు పంపితే హోమ్ క్వారంటైన్ లో ఉంటామని వేడుకుంటున్నారు. వైద్యులు, పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పారు. క్వారంటైన్ లో కరోనా కిట్లు అయిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. కిట్లు వచ్చిన వెంటనే పరీక్షించి పంపిస్తామన్నారు.
ఇదీ చదవండి: