కర్నూలు జిల్లా ఆదోనిలో గర్భిణులు స్కానింగ్ కోసం బారులు తీరారు. పట్టణంలోని మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం నుంచి స్కానింగ్ కోసం భారీ ఎత్తున్న వరుసలో నిలబడ్డారు. కోవిడ్ నిబంధనలు, భౌతిక దూరం పాటించకుండా నిల్చున్నారు.
రోజూ కరోనా కేసులు పెరుగుతున్నా.. అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం, వరుసలో గంటల తరబడి నిలబడటం ఇబ్బందిగా ఉందని గర్భిణులు వాపోయారు. సిబ్బంది తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
ఇదీ చూడండి: