శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా.. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని కొండపై వెలసిన కొండరాయుడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. పట్టణంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
ఉత్సవాల సందర్భంగా.. కొండపైన అనేక సంఖ్యలో తేళ్లు కనిపిస్తాయి. వీటిని చిన్నాపెద్ద అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ పట్టుకుని విన్యాసాలు చేశారు. నోటిపై, చేతులపై, తలపై పెట్టుకుని పూజించారు. అనంతరం కొండరాయుడికి తేళ్లతో అభిషేక పూజలు చేశారు.
ఇదేంటని అడిగితే.. శ్రావణ సోమవారం సందర్భంగా తేళ్లు కుట్టవని.. ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టే.. తేళ్లతో నిర్భయంగా పూజలు నిర్వహించారు. ఈ ఆచారాన్ని కొత్తగా తెలుసుకున్నవాళ్లు.. ఆశ్చర్యపోయారు.
ఇదీ చదవండి:
రెచ్చిపోతున్న మట్టి మాఫియా... యథేచ్ఛగా కంకర, మట్టి, గ్రావెల్ తవ్వకాలు