నంద్యాల ఎస్పీవై ఆగ్రో కర్మాగారంలో కాలుష్య నియంత్రణ అధికారులు తనిఖీ చేశారు. కర్మాగారం నుంచి దుర్వాసన వస్తుందనే ఫిర్యాదు మేరకు సంయుక్త పర్యావరణ ముఖ్య ఇంజనీరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థలాన్ని సందర్శించారు. దుర్వాసనకు గల కారణాలపై ఆరా తీశారు. కొన్ని పరికరాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని పరిశ్రమ ప్రతినిధులు వివరించారు. మరమ్మతులు జరిపే వరకు కర్మాగారాన్ని మూసేయాలని ముఖ్య ఇంజనీరు ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి :