ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్‌తోపాటు.. కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన గుంటూరు శ్రీనును పట్టుకునేందుకు మరో బృందం ఆంధ్రప్రదేశ్‌లో గాలిస్తోంది. అపహరణకు వాడిన కార్లను గుర్తించే యత్నాలు కొనసాగుతున్నాయి. భార్గవ్‌రామ్ సహా నిందితుల సెల్‌ఫోన్లు ఆపేసి ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆచూకీని ఆరా తీస్తున్నారు.
రెండుసార్లు అఖిలప్రియకు వైద్య పరీక్షలు
అఖిలప్రియ తరఫు న్యాయవాదులు శుక్రవారం రాత్రి ఆమెను చంచల్‌గూడ జైల్లో కలిశారు. అనారోగ్య సమస్యలున్నాయని, కిందపడిపోయానని ఆమె న్యాయవాదులకు వివరించారు. ఈ విషయాలను వారు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ఆమే స్వయంగా తన పరిస్థితిని జైలు అధికారులకు వివరించారు. దీంతో శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నం ఆమెకు ఉస్మానియా ఆసుపత్రిలో రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించినట్లు జైలు పర్యవేక్షణాధికారి వెంకటలక్ష్మి తెలిపారు.
నివేదికను సోమవారం సికింద్రాబాద్ కోర్టులో సమర్పించనున్నామన్నారు. తాను పదేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నానని, మూడు నెలలుగా మందులు వేసుకోవడం లేదని, ఉస్మానియా ఆర్‌ఎంవో డా.ప్రసాద్, డా.సౌమ్యలకు అఖిలప్రియ వివరించారు. సీటీస్కాన్, అల్ట్రాసౌండ్, ఎమ్మారై తదితర పరీక్షల అనంతరం న్యూరో ఫిజీషియన్ వద్దకు వెళ్లాల్సిందిగా ఆమెకు సూచించామని డా.సౌమ్య, ఉస్మానియా సూపరింటెండెంట్ డా.బి.నాగేందర్ తెలిపారు.
ఇదీ చదవండి: