కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతా కొండల్లోని నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్లాస్టిక్ డ్రమ్ములు, సారా తయారీకి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కొండ ప్రాంతాల్లో పెరుగుతున్న అనధికార సారా తయారీ అమ్మకాలను అరికట్టేందుకు దాడులు నిర్వహిస్తూనే ఉంటామని సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు, నాటు సారా తయారీవంటి ఘటనలకు పాల్పడితే.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
4 జిల్లాల్లో 5 ప్రమాదాలు.. కానిస్టేబుల్ సహా నలుగురు దుర్మరణం