చిన్నారి అపహరణ కేసును కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు ఛేదించారు. షేక్ నిలోఫర్ అనే మహిళ తమ రెండు నెలల బాబు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా నేత్రాల ఆధారంగా బాధితురాలి సొంత చెల్లెలు గోరినే చిన్నారిని ఎత్తుకెళ్లిందని పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: