కర్నూలు జిల్లా మహానంది ఆలయ ఉద్యోగులపై పోలీసు కేసు నమోదైంది. ఉద్యోగులు.. దాతలు ఇచ్చిన సొమ్ముకు సరైన లెక్కలు చూపించలేదనే ఆరోపణతో ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సొమ్ము అవకతవకలో వీరి ప్రమేయం ఉందని సభ్యులు అంటున్నారు.
దీనిపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆరుగురి ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు అప్పటి ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, ఉద్యోగులు, ఈశ్వరరెడ్డి, శశిధర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, మరో ఉద్యోగిపై కేసు నమోదైంది. వీరిలో ఈవో మృతి చెందగా.. శ్రీశైలం టికెట్ల విషయంలో శశిధర్ రెడ్డి సస్పెన్షన్కు గురయ్యారు.
ఇవీ చదవండి..