కర్నూలు జిల్లా డోన్‌లో ఓ పంది జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. రాఘవేంద్రస్వామి ఆలయం వీధిలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచింది. వీధిలో వెళ్తుండగా హఠాత్తుగా ఆమెపైకి ఎగబడింది. బాధితురాలి అరుపులతో స్థానికులు వెంటనే స్పందించారు. తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. పట్టణంలో రోడ్లపై పందుల సంచారంతో ఎంతోమంది వాహనదారులకు గాయాలయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... స్పందించడం లేదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి.