కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోగనూర్ రోడ్డులో నరసింహులు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మతిస్థిమితం లేక కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణం చెందినట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. అడ్డుకోబోయిన అతని తల్లికి గాయాలైనట్లు తెలిపారు. మృతుడికి వివాహమైందని.. భార్య పుట్టింట్లో ఉందని చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..