ETV Bharat / state

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పురుగుల మందు తాగి యువకుడు మృతి
పురుగుల మందు తాగి యువకుడు మృతి
author img

By

Published : Feb 2, 2021, 10:26 AM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం రాళ్ల కొత్తూరు సమీపంలోని పొలాల్లో సంజీవ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొలిమిగుండ్ల మండల సమీపంలోని రాంకో సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న సంజీవ్​కు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు.

చికిత్స చేయించుకుంటానని.. నంద్యాల ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి సంజీవ్ ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గమధ్యంలో రాళ్లకూతురు ప్రాంత సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఠాణాల్లోనే లైసెన్స్‌డ్‌ ఆయుధాలు .. బ్యాంకులకు మాత్రం మినహాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.