కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి అనుమతులు రావడం శుభపరిణామమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర పౌరవిమానయాన సంస్థ ఓర్వకల్ ఎయిర్ పోర్టులో రాకపోకలకు అవసరమైన అన్ని సాంకేతిక అనుమతులివ్వడం వలన పారిశ్రామికాభివృద్ధి మరింత పరుగులు పెడుతుందని అన్నారు. మార్చి నెల నుంచీ రాకపోకలను ప్రారంభిస్తామని వెల్లడించారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి 50 కోట్లు ఖర్చు పెట్టిందని మంత్రి తెలిపారు. ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావడంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. పౌర విమాన రాకపోకలకు అనుమతులు రావడంతో సుదూర ప్రయాణాలకు అవకాశం ఏర్పడిందన్నారు.విశాఖ సహా ఇతర ముఖ్య నగరాలకు త్వరగా చేరుకోవచ్చని తెలిపారు.
ఇవీ చదవండి