కర్నూలు జిల్లా ఆదోనిలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే కొవిడ్ నిబంధనలు పాటించకుండా అధికారుల నిర్లక్ష్య వైఖరితో రైతులు రోజుల తరబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. గ్రామంలో వాలంటీర్లు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికి....పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. గ్రామాల్లో యూరియా అందకపోవడం వల్ల ఆదోని వస్తే అక్కడ కూడా రైతులకు దక్కడం లేదు. నాలుగు రోజుల నుంచి వరుసలో నిలబడినా ఇప్పటివరకు యూరియా ఇవ్వలేదని.. వ్యవసాయ అధికారుల పైన రైతులు మండిపడుతున్నారు. నిన్న 15 లారీల యూరియా వచ్చినా.. వరుసలో ఉన్న రైతులకు ఇవ్వకుండా....అధికారులు నేరుగా అధికార పార్టీ ఎవరికి చెబితే వాళ్లకు మాత్రమే యూరియా అందించారని అన్నారు.
ఇదీ చూడండి.
'నా భర్త ఆచూకీ తెలపండి' సబ్ కలెక్టర్కు మహిళ ఫిర్యాదు