మొహరం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో పీర్ల నిమజ్జనం భక్తి శ్రద్ధలతో సాగింది. మసీదుల దగ్గర కొలువుతీరిన పీర్ల స్వాములను హిందూ-ముస్లింలు దర్శించుకున్నారు. పీర్ల స్వాములకు మొక్కులు సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మసీదుల దగ్గర ఏర్పాటు చేసిన నిప్పుల కొలిమిలో స్వాములు నడుచుకుంటూ వెళ్లి త్యాగాన్ని చాటిచెప్పారు. కుల మతాలకు అతీతంగా భక్తులంతా పీర్ల ఊరేగింపులో పాల్గొనగా రంగులు చల్లుకుంటూ ఐక్యతను చాటారు.
ఇదీ చూడండి:
ఓ బొజ్జ గణపయ్య... పూలతో అలంకరించామయ్యా..