'ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించాలి' - latest news on pawan kalyan
ప్రజలకు అవసరమైన పథకాలను గత ప్రభుత్వాలు ప్రవేశపెడితే... నూతనంగా అధికారం చేపట్టినవారు వాటిని కొనసాగించకపోవడం దారుణమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సంస్కృతి మారాలని పవన్ ఆకాంక్షించారు. కర్నూలు జిల్లాలో రెండోరోజు పవన్ పర్యటన కొనసాగుతోంది. జోహరాపురం బ్రిడ్జిని పరిశీలించిన ఆయన... వంతెన సమస్యపై స్థానికులతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు బాగా ఆలోచిస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు.