కర్నూలులో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు విధులు బహిష్కరించారు. 2017-18 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఇప్పటికే నాలుగు సార్లు తనిఖీలు చేశారని... తిరిగి మళ్లీ ఇప్పుడు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు.
లాక్డౌన్ కారణంగా ఇప్పటికే పని భారం ఎక్కువగా ఉందని... తనిఖీలు చేయడం వల్ల మరింత భారం పెరుగుతోందని అంటున్నారు. మా పని మమ్మల్ని చేసుకోనివ్వడంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏనుగే ఆ బాంబు ఉన్న పండును ఆరగించిందా?