కర్నూలు జిల్లా నంద్యాల బొగ్గులైన్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే... బండి ఆత్మకూరు మండలం సోమయాజుల పల్లెకు చెందిన భూమా శేఖర్ రెడ్డి... బెంగుళూర్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగులచవితికి స్నేహితులను కలిసేందుకు నంద్యాలకు వచ్చి...తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శేఖర్ రెడ్డి ద్విచక్రవాహనంపై నూనెపల్లె నుంచి బొమ్మలసత్రం వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది.దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: పక్షిలా ఎగురుతూ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కు!