కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం నుంచి సినిమా హాళ్లు ప్రారంభించేందుకు ఆయా యాజమాన్యాలు ముందుకొచ్చాయి. కరోనా లాక్డౌన్తో మూతపడిన థియేటర్లు దాదాపు 9 నెలల తర్వాత తెెరుచుకోబోతున్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు థియేటర్లల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రాంగణాన్ని శానిటేషన్ చేయించారు. గత నెలలోనే సినిమా హాళ్ల ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. నిర్వాహకులు ముందుకురాలేదు. తాజాగా ఆదోనిలో ప్రారంభం చేసేందుకు యాజమాన్యాలు ముందుకొచ్చాయి.
ప్రతి షో ముందు శానిటేషన్ చేయిస్తాం. మాస్కు లేకుండా వస్తే థియేటర్ లోపలికి అనుమతించం. 10 ఏళ్లలోపు- 60 ఏళ్లపైబడిన వాళ్లకు అనుమతి లేదు. - థియేటర్ యాజమాని