కర్నూలు పాతనగరంలోని పెద్దపడఖానా ప్రాంతంలో ఉంటున్న మోహనమ్మ వయసు 105 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఆమెకు షుగర్ వ్యాధి మినహా ఇతర అనారోగ్యాలు లేవు.
అయితే వృద్ధాప్య పింఛను తీసుకునేవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించటంతో.. మోహనమ్మ పరీక్షలు చేయించుకున్నారు. జులై 19న పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబసభ్యులందరూ ఆందోళన చెందారు. ఆమెను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉండటంతో ఆక్సిజన్ పెట్టారు. చికిత్స తీసుకున్న 14 రోజులకు ఆమె కోలుకున్నారు. రెండుసార్లు పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో జులై 31న డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు కుటుంబసభ్యులతో కలిసి హాయిగా ఉంటున్నారు.
క్రమశిక్షణతో కూడిన జీవన విధానం వల్లే ఈ వయసులోనూ కొవిడ్‌ను జయించానని చెప్పారు మోహనమ్మ. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేస్తారు, మితాహారం తీసుకుంటారని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
కరోనా మహమ్మారి విషయంలో ఆందోళన చెందుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్న యువతకు మోహనమ్మ స్ఫూర్తిగా నిలుస్తారనడంలో సందేహంలేదు.
ఇవీ చదవండి..
కుమారుణ్ని చితక బాదిన ఎస్సై... మనస్థాపంతో శానిటైజర్ తాగిన తల్లి