కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండ్లో పై పెచ్చులుడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లా పెద్దముడియం మండలం కొండ సుంకేసులకు చెందిన రాజు (60) బస్టాండ్లో కూర్చుని ఉండగా పై నుంచి పెచ్చులూడి పడ్డాయి. గాయాలు కావటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సదరు వ్యక్తి గత కొంత కాలంగా పలు దుకాణాల్లో పనిచేస్తూ ఇక్కడే జీవనం సాగించేవాడని పోలీసులు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి