పౌష్టికాహార మహోత్సవం పురస్కరించుకుని కర్నూలులో 2కే రన్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ప్రారంభించారు. పోషకాహారం ఇంటింటి వ్యవహారం అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం నుంచి కోట్ల కూడలి వరకు మహిళ, శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. పౌష్టికాహరంతోనే ఆరోగ్యం, చురుకైన తత్వం అబ్బుతుందని అదనపు జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దిన్ అన్నారు. అనంతరం 2కే రన్ లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందించారు.
ఇది చూడండి: పౌష్టికాహారంతోనే పిల్లలకు ఆరోగ్యం