కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కరోనా కారణంగా బోసిపోయింది. ఆసుపత్రిలో పని చేసే ఇద్దరు వైద్యులకు కరోనా నిర్దరణ అయినట్లు తెలిసింది. ఆసుపత్రికి వైద్యం కోసం ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు.
కరోనా కారణంగా ఓపీ సగం తగ్గింది. రోజు 300 మందికి పైగా రోగులు రాగా.. ఇప్పుడు అందులో సగం మంది మాత్రమే వస్తున్నారు. వైద్యం కోసం వచ్చేవారికి.. బయటే నిలబెట్టి కిటికీలో నుంచి జబ్బు తెలుసుకొని మందులు ఇచ్చి పంపుతున్నారు. అత్యవసరమైన వారికి మాత్రమే లోపల వైద్య సేవలు అందిస్తున్నారు.
ఇదీ చదవండి: