కర్నూలు జిల్లా పాణ్యం మండలం కవులూరు గ్రామంలో దళితుల శ్మశానానికి సరైన దారి లేక అంత్యక్రియలు చేయడానికి గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దళితుల శ్మశాన వాటికకు వెళ్లాలంటే సమీపంలోని కానుకల వాగు దాటాల్సి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా కానుగుల వాగుపై వంతెన నిర్మించి రహదారి సమస్య తీర్చాలని అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![no road for burial ground at karnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-knl-141-31-smasanam-samasya-av-ap10059_31082020200838_3108f_1598884718_540.jpg)
గ్రామానికి చెందిన విజయుడు గుండెపోటుతో మృతి చెందడంతో అంత్యక్రియలు చేయడానికి నానా అవస్థలు పడవలసి వచ్చింది. కానుగుల వాగులో గొంతు వరకు ఉన్న లోతు నీటిలో దిగి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. విషయం తెలుసుకున్న నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి స్మశాన రహదారిని పరిశీలించి సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 'కొండపల్లి' తవ్వకాలపై నిగ్గుతేల్చిన కమిటీ...క్వారీ లీజుల రద్దు!