చెత్తను ఉపయోగించి వివిధ రకాల వస్తువులు తయారుచేసి అందర్నీ ఆకర్షిస్తుందీ.....ఓ స్వచ్ఛంద సంస్థ . దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో దిల్లీ, బెంగళూరు కేంద్రంగా చెత్తను సేకరించి పుస్తకాలు, పెన్సిళ్లు, బల్లలు, కుర్చీలు, మంచాలు, సోఫా సెట్లు తయారుచేస్తున్నారు. వాటిని ప్రభుత్వ పాఠశాలలకు విరాళంగా అందిస్తున్నారు. అలాగే కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్లలోని ప్రత్యేక ప్రాథమిక పాఠశాలకు బల్లలు, కుర్చీలు, పుస్తకాలను ఎమ్మెల్యే ఆర్థర్ చేతులమీదుగా అందజేశారు. ఇంతకుముందు అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రత్యేక పాఠశాలలకు వస్తువులను అందజేసినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఇదీ చదవండి