కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. రూ.33 కోట్లతో 11 నూతన భవనాలు ఏర్పాటు కానున్నాయి. తొలుత రూ.13.40 కోట్లతో ఎలక్ట్రానిక్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగా రూ. 4 కోట్లతో భవనాన్ని నిర్మించారు. తర్వాత ఆ కేంద్రాన్ని గుంటూరుకు తరలించారు. దీంతో భవనం మిగిలిపోయింది. ఆ భవనాన్ని మరో అవసరాలకు వినియోగించనున్నారు. పరిశోధన భవన సముదాయం, శీతల గోదాము, విత్తన నిల్వ గోదాము, విత్తన గోదాము, విత్తన సాంకేతిక పరిశోధన ప్రయోగశాల భవనం, మరో విత్తన గోదాము, శిక్షణ కేంద్ర భవనం, మధ్యతరహా విత్తన శీతల గోదాము మంజూరు అయ్యాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని భవనాలు పూర్తయ్యాయి. మరికొన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వ్యవసాయ పరిశోధనా స్థానంలో 11 భవనాలు ఒకేసారి ఏర్పాటు కావడం విశేషం.
ఇదీ చదవండీ: కేంద్ర మంత్రికి బెదిరింపు... తర్వాత ఏం జరిగింది?