ETV Bharat / state

సాగర్​కు కొత్త శోభ : రెండ్రోజుల్లో నూతన క్రస్ట్ గేట్ల ఏర్పాటు

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలకు కొత్త శోభ రాబోతోంది. క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని డ్యాం కమిటీ ప్రతిపాదించింది. రెండు మూడ్రోజుల్లో దీనికి సంబంధించిన పనులు సైతం ప్రారంభించనున్నారు.

new crust gates to nagarjuna sagar dam
new crust gates to nagarjuna sagar dam
author img

By

Published : Apr 22, 2021, 11:49 AM IST

నాగార్జునసాగర్‌ డ్యాం కుడి, ఎడమ కాలువల క్రస్ట్ గెట్ల స్థానంలో కొత్త వాటిని అమర్చాలని డ్యాం నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.9 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. కుడి కాలువకు తొమ్మిది, ఎడమ కాలువకు మూడు క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఎడమ కాలువ కన్నా కుడి కాలువ గేట్లు చిన్నవి. గత వర్షాకాలంలో సాగర్‌ జలాశయానికి గరిష్ఠస్థాయి నీరు వచ్చి చేరింది. కుడి కాలువ తొమ్మిదో గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్న సమయంలో ఒత్తిడి ఎక్కువై మరమ్మతులకు లోనైంది. అప్పటి నుంచి ఆ గేటు ద్వారా నీరు వృథాగా లీకవుతూనే ఉంది.

తుప్పు పట్టి పలుచబడ్డాయి..

ఈ నేపథ్యంలో కాలువల క్రస్ట్​గేట్లకు తుప్పు పట్టి పలుచబడ్డాయని.. వాటిని తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. కుడి కాలువ ఒక్కో గేటుకు రూ.50 లక్షల చొప్పున తొమ్మిదింటికి రూ.4.5 కోట్లు.. ఎడమ కాలువ ఒక్కో గేటుకు రూ.1.50 కోట్లు చొప్పున రూ.4.50 కోట్లు వ్యయం కానున్నట్లు కమిటీ సభ్యులు అంచనా వేశారు. ముందుగా కుడి కాలువ తొమ్మిదో గేటు ఏర్పాటు పనుల్ని రానున్న రెండు మూడ్రోజుల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.