కర్నూలు జిల్లా బనగానపల్లె మార్కెట్ యార్డ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్ని విధాలా న్యాయం చేశారని ఎమ్మెల్యే అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంతో ఎంతోమంది పేద రైతులకు పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా ఉందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా ఎస్సీ మహిళ దీవెనమ్మను ఎంపిక చేశామని తెలిపారు. ఉప చైర్మన్‌గా స్పందన జనార్దన్‌రెడ్డి, కమిటీ సభ్యులుగా మరో 18 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇదీ చూడండి రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి