ఆసుపత్రికి నీటి కష్టాలు...రోగులకు తప్పని తిప్పలు కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు రోజూ 1000 మందికి పైగా రోగులు వస్తుంటారు. రోగులు, వారి బంధువుల తాకిడితో ఆసుపత్రిలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో మాతా శిశుకేంద్రం, డయాలిసిస్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్యశాలకు రోజూ 2 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. నీటి వినియోగం ఎక్కువగా ఉండడం వలన ఆసుపత్రి ఆవరణలో బోర్లు వేసే ప్రయత్నం చేశారు. కానీ నీరు పడకపోవడంతో పురపాలక సంస్థ సరఫరా చేసే నీటినే వినియోగిస్తున్నారు. బయట బోర్ల నుంచి 20 వేల లీటర్లు, పురపాలక సంఘం నుంచి 15 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా నీటి సమస్య కొనసాగుతూనే ఉంది.
నీటికొరతతో ఆసుపత్రి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. ఇదీ చదవండి :
ఇతడి పారాగ్లైడింగ్ చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే!