ఇవి కూడా చదవండి:' 11లక్షల విలువ చేసే పట్టుచీరలు పట్టుకున్న పోలీసులు'
నంద్యాలను జిల్లా చేస్తా: చంద్రబాబు - election campaign of cm in kurnool
ప్రజల కోసం తెలుగుదేశం.. వైకాపా, తెరాస, భాజపాతో పోరాటం చేస్తుందని చంద్రబాబు నాయుడు నంద్యాలలో స్పష్టం చేశారు. బాంబులకే భయపడలేదని.. కేసీఆర్, జగన్ ఎంత అని అన్నారు. నంద్యాలను జిల్లా చేస్తానని ప్రకటించిన చంద్రబాబు...నంద్యాల కేంద్రంగా పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత తనదని తెలిపారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
రాష్ట్ర జలవనరుల్ని కొల్లగొట్టేందుకు కేసీఆర్... జగన్తో కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ... తెలంగాణ వక్ఫ్ బోర్డులో 70 కోట్లు ఉంటే..రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఢీ అంటే మేమూ ఢీ అంటామన్న సీఎం... ప్రజల్లో చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ కుట్రలు.. కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా, వైకాపాది.. భార్యాభర్తల సంబంధమని వ్యాఖ్యానించిన చంద్రబాబు... దొంగలకు, నేరస్థులకు కాపలాదారుడు మోదీ అని పేర్కొన్నారు. నంద్యాలలోని పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్న సీఎం...ఎన్నికలు అవగానే నంద్యాలను జిల్లా చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్ల తెదేపా పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని తెలిపిన బాబు..జగన్ వస్తే పారిశ్రామికవేత్తలు ముందుకురారని వివరించారు. నంద్యాల కేంద్రంగా పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత తనదన్న సీఎం..రాష్ట్రానికి ప్రధాన సమస్యజగనే అని మరోసారి స్పష్టం చేశారు. జగన్‌ను ఇంటికి పంపించకుంటే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని సీఎం రాష్ట్ర ప్రజల్ని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:' 11లక్షల విలువ చేసే పట్టుచీరలు పట్టుకున్న పోలీసులు'
sample description