ETV Bharat / state

విషాదం: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన యువకులు.. అనుమానాస్పద మృతి

పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన యువకులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. యువకుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

mysterious death
పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన యువకులు అనుమానాస్పద మృతి
author img

By

Published : Jul 2, 2021, 1:09 AM IST

పుట్టినరోజు జరుపుకోవడం అంటే ఓ సరదా. కానీ.. వారికి అదే చివరి రోజు అవుతుందని ఊహించలేదు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఆరిఫ్​ది (18) జులై 1 న పుట్టినరోజు. తన పుట్టిన రోజును స్నేహితులు సులేమాన్ (19), ఈశ్వర్, గఫార్ లతో సరదాగా గడపటం కోసం ఆళ్లగడ్డ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని గన్లేరు జలాశయానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు మద్యం సేవించారు. మద్యం మత్తులో ఆరిఫ్, సులేమాన్ జలాశయం పరిధిలోని ఓ నీటి గుంతలోకి దిగారు.

మద్యం మత్తులో ఉన్న వీరు ఈదలేక నీట మునిగిపోయారు. గట్టున ఉన్న గఫార్, ఈశ్వర్​లు వారు బయటకు వస్తారని చాలా సేపు వేచి చూశారు. అయితే.. ఎంతకీ రాకపోవడంతో ఆందోళనకు గురై ఆళ్లగడ్డ పట్టణం చేరుకొని గల్లంతైన యువకుల తల్లిదండ్రులకు సమాచారం తెలియజేశారు. గఫార్, ఈశ్వర్​ల దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానం చెందిన తల్లిదండ్రులు ఆళ్లగడ్డ పోలీసులను ఆశ్రయించారు.

యువకులు గల్లంతైన జలాశయం రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెబుతూ పోలీసులు వారిని అక్కడికి పంపించారు. ఫిర్యాదు అందుకున్న రుద్రవరం ఎస్సై రామ్మోహన్​ రెడ్డి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నీటి గుంట వద్ద గాలింపు చేపట్టారు. రాత్రి సమయం కావటంతో గాలింపు చర్యలను కొనసాగించలేక పోయారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలతో కూడిన కర్రలు ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మద్యం మత్తులో నలుగురు గొడవ పడినట్లు అక్కడ దృశ్యాలు బట్టి తెలుస్తోందని ఎస్సై తెలిపారు. శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

DEAD: జొన్నాడ జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.