ఆగస్టు తర్వాత కర్నూలు అభివృద్ధిలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఇప్పటికే కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసిందని చెప్పారు. నేను చెప్పకనే చెబుతున్నా.. రానున్న రోజుల్లో నగరంలో అభివృద్ధి జరుగుతుంది అని మంత్రి అన్నారు. కర్నూలు నగర పరిధిలో రూ.9 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు 2, 6 వార్డులల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం నూతన కౌన్సిల్ హల్లో జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సెజ్‌లు, లే ఔట్లతో అద్భుతంగా అభివృద్ధి చెందబోతోందన్న ఆదిమూలపు.. వైకాపా ప్రభుత్వ ప్రణాళికలో కర్నూలు నగరానికి అతి ముఖ్యమైన స్థానం ఉందన్నారు. ఆగస్టు తర్వాత కర్నూలులో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. రాష్ట్రంలోని 16వేల లేఔట్లను త్వరలో క్రమబద్దీకరించబోతున్నామని ప్రకటించారు.
ఇదీ చదవండి: