కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో ముగతి ఫారం విత్తనోత్పత్తి ప్రదర్శన క్షేత్రంలో 57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి తుంగభద్ర దిగువ కాల్వ ద్వారా సాగు నీరు అందిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఫారంలో వరి బీపీటీ-5204 రకం సాగు వరి సీడ్ సాగు చేసి రాష్ట్రంలోని రైతులకు రాయితీపై అందజేస్తున్నారు. అధికారులు ఈసారి ఎల్ ఆర్జీ 52 రకం కంది సీడ్ విత్తనం సాగు చేపట్టారు. ప్రభుత్వం పప్పు దినుసులు రకం పంటను ప్రోత్సహించేందుకు, రైతులకు మేలు రకం కంది విత్తనం అందించేందుకు సీడ్ సాగు మార్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి