కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని... ఇందుకోసం 1,785 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11 వేల 6 వందల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు.
అందరూ సమర్థవంతంగా పనిచేయాలి..
గురువారం జరగనున్న పరిషత్ ఎన్నికల్లో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ అన్నారు. కే.నాగలాపురం ఠాణా పరిధిలోని కల్లూరు మండలం సల్కాపురంలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేట్లు చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
ఎమ్మిగనూరులో ఎన్నికల సామగ్రితో సిబ్బందిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించారు. నంద్యాల నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది.. మండల అబివృద్ది కార్యాలయంలోని ఎన్నికల సామగ్రితో కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.
కోడుమూరు మండలంలో అధికారులు సరైన వసతులు కల్పించలేదని సిబ్బంది పేర్కొన్నారు. కనీసం తాగునీటి సౌకర్యాలూ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర వసతులతో నేలపై కూర్చుని పోలింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇదీ చూడండి: