Avinash Reddy Mother Treatment: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి కర్నూలు నగరంలోని విశ్వభారతి ఆసుపత్రిలో రెండో రోజు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను నిన్న కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. అవినాష్ రెడ్డి సైతం ఆసుపత్రిలోనే తల్లితో పాటు ఉన్నారు.
అవినాష్ తల్లిని పరామర్శించిన వైసీపీ నేతలు: కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై స్థానిక వైసీపీ నేతలు ఆరా తీశారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, కర్నూలు, శ్రీశైలం ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, శిల్పా చక్రపాణి రెడ్డి ఆసుపత్రికి చేరుకుని.. వైద్యులతో మాట్లాడారు. ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో.. చూసి పరామర్శించేందుకు వీలు లేకుండా పోయిందని నేతలు తెలిపారు. శ్రీలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
"అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలిసి.. పరామర్శించడానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉంది కాబట్టి.. వెల్లడానికి లేదు. అందుకని లోపలికి వెళ్లలేదు.. చూడటం అవ్వలేదు. అదే విధంగా అవినాష్ రెడ్డి ద్వారా, డాక్టర్ల ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది". - శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే
అసలు ఏం జరిగిందంటే?: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శుక్రవారం విచారణకు హాజరుకావలసి ఉంది. విచారణ నిమిత్తం సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన ఆయన.. మార్గమధ్యలోనే పులివెందులకు పయనమయ్యారు. తన తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన విచారణకు రాలేనని సీబీఐకు లేఖ ద్వారా తెలియజేశారు. తన తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్పించినట్లు అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
తరువాత అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అవినాష్ తల్లికి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. తల్లి వెంట ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా ఆసుపత్రికి వెళ్లారు. తొలుత అవినాష్‌రెడ్డి తల్లిని పులివెందుల ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నామని కుటుంబసభ్యులు అన్నారు. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం నాటికి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఛాతి నొప్పి రావడంతో ఈసీజీ పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. బీపీ తక్కువగా ఉందని.. ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: