ETV Bharat / state

కర్నూలుకు విజిలెన్స్‌ కమిషన్​ ఆఫీసు - Moving vigilance offices to Kurnool ... Government orders

విజిలెన్స్‌ కార్యాలయాలు కర్నూలుకు తరలిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం నుంచి పనిచేస్తున్నాయి. పరిపాలన కారణాల రీత్యా వీటిని కర్నూలుకు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది.

విజిలెన్స్‌ కార్యాలయాలు కర్నూలుకు తరలింపు

author img

By

Published : Feb 1, 2020, 7:06 AM IST

Updated : Feb 1, 2020, 9:15 AM IST

విజిలెన్స్‌ కమిషన్​ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం నుంచి పనిచేస్తున్నాయి. పరిపాలన కారణాల రీత్యా వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాల్సిందిగా కర్నూలు జిల్లా కలెక్టర్‌, రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌లను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ కార్యాలయాలను తరలిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఇవీ చదవండి

పెన్షన్ చెల్లింపులో సరికొత్త విధానం

Last Updated : Feb 1, 2020, 9:15 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.