కర్నూలు జిల్లా రుద్రవరం మండలం తిమ్మనపల్లె గ్రామంలో రైతులు మొక్కజొన్నను ఎక్కువగా పండిస్తుంటారు. మొక్క జొన్న కంకులు అయ్యాక.. వాటిని తినేందుకు.. కోతులు వస్తుంటాయి. గుంపులు గుంపులుగా వచ్చి.. పంటను నాశనం చేస్తుంటాయి. ఈ సమస్య నుంచి పొలాలను కాపాడేందుకు గ్రామానికి చెందిన వరాల అనే మహిళకు ఒక ఉపాయం తట్టింది.
బొమ్మల దుకాణాల్లో లభించే పిశాచి మాస్క్‌ను కొనుగోలు చేసింది. దానిని మెుహానికి ధరించి.. సమీపంలోని రహదారిపై తిరిగే వారు. ఆమె మాస్క్ ధరించి తిరుగుతుంటే.. కోతులు పరార్ అయ్యేవి. కోతులు భయంకరమైన బొమ్మలు చూస్తే భయపడతాయని తమ బంధువులు తెలిపారని.. వరాల తెలిపారు.
అందుకే 150 రూపాయల మాస్క్ ధరించి.. తిరుగుతుంటే.. కోతులు భయపడి రావట్లేదని చెబుతున్నారు. ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశానని ఇలా కేవలం 150 రూపాయలు తోనే పంట ను రక్షించుకోవడం సంతోషంగా ఉందని వరాల పేర్కొన్నారు.
ఇదీ చదవండి: