కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెంగలాంపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులతోపాటు ఓ కొండముచ్చు రోజూ తరగతులకు హాజరవుతుంది. సమీపంలోని కొండల్లో నివసించే ఈ వానరం కొన్నిసార్లు రోజంతా పాఠశాలలోనే గడుపుతుంది
సాధారణంగా కోతిని చూస్తే పిల్లలు హడలిపోతారు. లేదా దాన్ని ఏడిపించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ కొండముచ్చు కొద్దిరోజుల్లోనే పిల్లలకు స్నేహితుడిలా మారిపోయింది. బడికి వచ్చింది మొదలు పిల్లలతో ఆటలు మొదలెడుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉంటే మాత్రం గోల చేయకుండా పాఠాలు వింటుంది
పిల్లలను ఏమీ అనకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటంతో ఉపాధ్యాయులూ దాన్ని తరిమేయలేదు. అంతేగాక తననీ ఓ విద్యార్థిగా భావించి పాఠాలు చెబుతున్నారు.
ఆదివారం పాఠశాలకు వచ్చి విద్యార్థులు ఎవరూ లేకపోయేసరికి నిరాశగా వెనక్కి వెళ్లిపోతుంది. మిగిలిన రోజుల్లో కొండముచ్చుకు టాటా చెప్పనిదే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంటికిపోరు. అందరికీ వీడ్కోలు పలికాక కొండల్లోకి నడుచుకుంటూ పోతుంది కొండముచ్చు.
ఇదీ చదవండి