అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని కర్నూలు జిల్లా నంద్యాల జ్ఞానాపురం వాసులు వాపోయారు. తీసుకున్న డబ్బు కంటే వడ్డీలే అధికంగా చెల్లించామని వారు తెలిపారు. వడ్డీ వ్యాపారుల తీరు తమను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భాదితులు నంద్యాల మూడో పట్టణ పోలీసుస్టేషన్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో... సీఐ శివశంకర్‌కు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందజేశారు.
ఇది చూడండి: కర్నూలును కాలుష్యం కమ్మేస్తోంది!